19 Nov 2008
బెంగుళూరులో అంతే
ఈ పోస్ట్ తెలుగులో వ్రాయటానికి రెండు కారణాలు ఉన్నాయి.
1. ఇంత వరకు నేను ఒక్క పోస్ట్ కూడా తెలుగు లో వ్రాయలేదు.
2. మొదటి పాయింట్‌నే మళ్లీ చదవండి.
కొన్ని పర్సనల్ reasons వల్ల నేను temporary గా బెంగుళూరు ఆఫీసు నుంచి వర్క్ చేస్తున్నాను. నాకు ముందు నుంచి ఎందుకో బెంగుళూరు నచ్చదు. కారణాలు అడిగితే చెప్పలేను. బహుశా ఆ కారణాలు తెలుసుకోవడానికే ఇక్కడి నుంచి వర్క్ చేస్తున్నానేమో.
మొదటి రోజు ఆఫీసుకు త్వరగా వెళ్దామని early మార్నింగ్ 9:30 కి లేచి రెడీ అయ్యాను. దేశంలో ఏమి జరుగుతోందో తెలుసుకుందామని న్యూస్ ఛానల్ పెట్టాను. అందులో ఒకడు ఎదురుగా laptop పెట్టుకొని వారం రోజుల క్రితం జరిగిన తాజా న్యూస్ చదువుతున్నాడు. కాసేపటికి suit వేసుకున్నావిడ వచ్చి గోడ మీదున్న ఇండియా మ్యాపును చూపిస్తూ వాతావరణ వివరాలు చెప్పటం మొదలుపెట్టింది. ముఖ్యంగా బెంగుళూరులో, ఆరు నూరైన, ఇలియానా రాశి ఆయినా , వర్షం మాత్రం పడదు అని చెప్పింది. సరే అని ఆఫీసుకు బయలుదేరాను. బాగా ఎండగా ఉంది. పర్లేదు ఈ మధ్య న్యూస్‌లో కూడా నిజాలు చెప్తున్నారు అని అనుకొంటుండగా మా పక్క రూమ్‌లో ఉన్న మలయాళం వాడు పెద్ద జెర్కిన్ వేసుకొని బయటకు వచ్చాడు. వాడిని చూసి "పిచ్చివాడా" అని తెలుగులో నవ్వుకున్నాను. వాడు కూడా నన్ను చూసి మలయాళంలో అదోలా నవ్వాడు. ఒక గంట తర్వాత ఆఫీసులో ఉన్నాను... తడిసిన బట్టలతో. అప్పుడు తెలిసింది వాడి మలయాళం నవ్వుకు అర్థం ఏమిటో. Basic గా బెంగుళూరు లో ఒక థియరీ ఉంది. ఏంటంటే , మనం ఎప్పుడైతే వర్షం పడదు అనుకుంటామో అప్పుడు పడుతుంది. ఎప్పుడైతే పడుతుంది అనుకుంటామో అప్పుడు కూడా పడుతుంది.
Last weekend సినిమాకు వెళ్దామని నా ఫ్రెండ్‌తో బైక్ లో బయల్దేరాను. దారిలో ఏదో కన్నడ పోస్టరులో ("ఏదో" అనేది కన్నడ సినిమా పేరనుకుంటే మీ ఖర్మ) హన్సిక నడుము మీద వాడెవడో చెయ్యివేసి నిల్చున్నాడు. "ఎవడ్రవాడు బొచ్చు పీకేసిన బ్రాయిలర్ కోడిలా ఉన్నాడు ?" అని కన్నడ సినిమాలు చూసే నా తెలుగు ఫ్రెండ్ రవిగాడిని అడిగా. " వాడే ఇక్కడ top హీరో " అని అన్నాడు. ఓహో ఇక్కడ top అంటే ఇంత low నా అని అనిపించింది.( గమనిక: నేను ఇప్పుడు చెప్పిన విషయం ఇక్కడ అమ్మాయిలు వేసుకునే top కి కూడా వర్తిస్తుంది.)
మొన్నామధ్య ఊరి నుంచి వస్తూ Majesticలో దిగాను. రూంకి వెళ్ళటానికి రిచ్ గా ఉంటుందని volvo సిటి బస్ లో ఎక్కా. టికెట్ 35/- అన్నాడు( ఇంకో 35/- వేస్తే మళ్లీ మా ఊరికి వెల్లిపోవచ్చు). బస్సు వాయువేగంతో దూసుకుపోతోంది.ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ పడింది. అంతే... వెంటనే బస్సులో నుంచి అయిదారుమంది చకచకా కిందకు దిగి పక్కనే ఉన్న టీ కొట్టులోకి వెళ్లారు.వారిలో డ్రైవర్ కూడా ఉన్నాడు. ఒక 4506 సెకన్ల తర్వాత గ్రీన్ సిగ్నల్ పడటంతో డ్రైవర్ బస్ స్టార్ట్ చేశాడు. "ఏంటయ్యా next సిగ్నల్ దగ్గర కూడా టీ కి ఆపుతావ?" అని డ్రైవర్ ని అడిగా . "లేదు సార్.. అక్కడ టిఫిన్ బ్రేక్ ఉంటుంది" అని casualగా అన్నాడు. ఇలా టీలు టిఫిన్లు చేసుకుంటూ రెండు గంటల తర్వాత నా స్టాప్ దగ్గర దించాడు. ఏమైన ...బెంగుళూరు ట్రాఫిక్ సూపర్.
ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ చూడకపోవటం ఎంత తప్పో బెంగుళూరు వెళ్లి Brigade road.. Forum చూడకపోవటం అంతే తప్పని ఎవరో అంటే .. సరే అని నేను, నరేష్ గాడు(పేరు మారుద్దాం అనుకున్నా.. అవసరం లేదనిపించింది) Forum కి వెళ్లాం. అక్కడికి వెళ్లాక తెలిసింది బెంగుళూరు ఎంత పేద నగరమొ అని.ఫాపం..వేసుకోవటానికి బట్టలు కూడా లేని వాళ్లు కనిపించారక్కడ. ఒకడు చినిగిపోయిన జీన్స్ వేసుకుంటె మరో అమ్మాయి ఒంటినిండా కప్పుకోవటానికి బట్టలు లేక చిన్న నిక్కర్ వేసుకొచ్చింది. సమాజ సేవకుడు, ఆపధ్భాందవుడు, పేదల పాలిట పెన్నిధి లాంటి బిరుదులకు మారుపేరైన మా నరేష్ గాడు కళ్లనీళ్లు పెట్టుకుంటూ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి తన ప్యాంటు తీసివ్వబోయాడు. ఆ అమ్మాయి వాడి వైపు విచిత్రంగా,వింతగా,వికారంగా, ఇంకా వివిధ రకాలుగా చూసి .. విసురుగా అక్కడినించి వెళ్లిపోయింది."ఎందుకురా ఆ అమ్మాయి అలా చూసింది?" అని కళ్లు తుడుచుకుంటూ అడిగాడు నరేష్ గాడు. ఏం చెప్పాలో తెలీక "బెంగుళూరులో అంతే " అని చెప్పి అక్కడినించి తీసుకెళ్లిపోయా :-) .
Amidst all these things I still like bangalore for one obvious reason... She stays here.
11 Nov 2008
More than a month…
There are days when I never missed to meet her on her birthday...hmmm.. on our birthday. There are days when I travelled all the way from Hyderabad to Bangalore for no reason other than to see her. Even if I had any reason, it mattered only after her.